Telugu Global
Cinema & Entertainment

Dil Raju Rajinikanth - రజనీకాంత్ తో దిల్ రాజు సినిమా చేయగలడా?

Dil Raju Rajinikanth - రజనీకాంత్-బాబి కాంబోలో సినిమా అంటున్నారు. మరి ఈ సినిమాను దిల్ రాజు పట్టాలపైకి తీసుకురాగలరా? అతడికి ఎదురయ్యే ఇబ్బంది ఏంటి?

Dil Raju Rajinikanth - రజనీకాంత్ తో దిల్ రాజు సినిమా చేయగలడా?
X

విజయ్ తో వారిసు సినిమా తీసి గ్రాండ్ గా కోలీవుడ్ లో అడుగుపెట్టాడు దిల్ రాజు. డిస్ట్రిబ్యూషన్ ను వేరే వాళ్లకు ఇచ్చేసినప్పటికీ, నిర్మాతగా తన పేరు మారుమోగేలా అప్పట్లో బాగానే సెట్టింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ లో మరో పెద్ద ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసే పనిలో పడ్డాడు రాజు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి రజనీకాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. ఈసారి కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే కోలీవుడ్ లో మూవీ చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ అవకాశం దర్శకుడు బాబికి దక్కినట్టు తెలుస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ దిల్ రాజుకు అసలైన సమస్య ఒకటి ఉంది.

ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా చేయాలంటే.. సన్ పిక్చర్స్ చేయాలి, లేదంటే లైకా ప్రొడక్షన్స్ చేయాలి. ఈ రెండు నిర్మాణ సంస్థలు మాత్రమే బ్యాక్ టుబ్యాక్ సూపర్ స్టార్ తో సినిమాలు చేస్తున్నాయి. వీళ్లను కాదని, దిల్ రాజుకు రజనీకాంత్ ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.

ప్రస్తుతానికైతే రజనీకాంత్ తో సినిమా చేసేందుకు బాబి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కథ దిల్ రాజుకు కూడా నచ్చితే, అప్పుడు రజనీకాంత్ అపాయింట్ మెంట్ తీసుకొని వెళ్లి కలుస్తారు. ఆ తర్వాత నిర్మాణ సంస్థ ఏదనేది ఫైనల్ అవుతుంది. సోలోగా దిల్ రాజే నిర్మిస్తారా.. లైకా లేదా సన్ తో జాయింట్ వెంచర్ గా చేస్తారా అనేది అప్పుడు తేలుతుంది.

బాలీవుడ్ లో ఫెయిలైన దిల్ రాజు, సౌత్ లో నిర్మాతగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తెలుగు, తమిళ భాషల్లో వారసుడు/వారిసు సినిమా తీశాడు. ఇప్పుడు రజనీకాంత్ ప్రాజెక్టు కూడా లాక్ అయితే, దిల్ రాజు పేరు మరోసారి సౌత్ అంతటా మారుమోగిపోవడం ఖాయం.

First Published:  14 April 2023 3:12 AM GMT
Next Story