Telugu Global
Cinema & Entertainment

Nithin | ఎందుకు అంత 'ఎక్స్ ట్రా' అయింది

Why Nithin - నితిన్ నటించిన తాజా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. ఈ సినిమా పూర్తవ్వడానికి ఏడాదికి పైగా టైమ్ తీసుకుంది. ఎందుకు..?

Extra Ordinary Man OTT | ఓటీటీలోకి నితిన్ సినిమా
X

హీరో నితిన్ ప్రస్తుతం డిసెంబర్ 8న విడుదల కానున్న తన రాబోయే చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టిందని, షూటింగ్‌లో జాప్యం జరిగినప్పుడల్లా టీమ్ అవుట్‌పుట్‌తో సంతృప్తి చెందలేదని, రీషూట్‌లు జరుగుతున్నాయని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే ఈ సినిమా స్క్రిప్ట్‌ను కూడా మార్చేశారనే వార్తలు కూడా వచ్చాయి. దాంతో ఈ సినిమాపై పలు నెగెటివ్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమా ఆలస్యానికి కారణాలను హీరో నితిన్ వెల్లడించాడు. ఆలస్యమైందని ఒప్పుకున్న ఆయన, సినిమా మేకింగ్ కు ఏడాదిన్నర పట్టిందని తెలిపాడు. స్క్రిప్ట్ విషయంలో తాను, దర్శకుడు రాజీ పడకూడదని నిర్ణయించుకున్నామని, అందుకే ఆలస్యమైందన్నాడు.

ఈ చిత్రంతో నితిన్, దర్శకుడు వక్కంతం వంశీ ఇద్దరూ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకే స్క్రిప్ట్ పై చాలా వర్క్ చేశారు. దీనికితోడు షూటింగ్ మొదలైన తర్వాత కూడా దర్శకుడు, మరిన్ని వెర్షన్లు రాశాడట. దీంతో రీషూట్స్ పడ్డాయంటున్నాడు నితిన్.

“స్క్రిప్ట్‌లో ఏ చిన్న డౌట్ వచ్చినా, మేం షూటింగ్ ఆపేసేవాళ్లం. మళ్ళీ రీ-వర్క్ చేసేవాళ్లం. తప్పులు సరిదిద్దుకున్న తర్వాత మళ్లీ రీ-షూట్ చేసేవాళ్లం. సొంత బ్యానర్ లో తీసిన సినిమా కాబట్టి మాకు ఆ స్వేచ్ఛ లభించింది." అన్నాడు నితిన్.

ఇప్పటికే విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సింగిల్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది . నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్.

First Published:  28 Nov 2023 1:56 AM GMT
Next Story