Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు థియేటర్లలోకి వ్యూహం.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఇప్పుడు ఆ తేదీకి కూడా వ్యూహం విడుదల కావడం లేదని.. ఒకరోజు ఆలస్యంగా అంటే మార్చి 2న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

ఎట్టకేలకు థియేటర్లలోకి వ్యూహం.. రిలీజ్ ఎప్పుడంటే..?
X

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా వ్యూహం. ఇప్పటికే ఎన్నోసార్లు విడుదల వాయిదా పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రాంగోపాల్ వర్మ ఈ సినిమా తీశాడు. రెండు నెలల కిందటే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే ఈ మూవీలో టీడీపీని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆ పార్టీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తాజాగా తొలగిపోవడంతో వ్యూహం సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని ఈ మూవీ మేకర్స్ భావించారు. సాంకేతిక సమస్యల కారణంగా వ్యూహం సినిమాను మార్చి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఆ తేదీకి కూడా వ్యూహం విడుదల కావడం లేదని.. ఒకరోజు ఆలస్యంగా అంటే మార్చి 2న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ' పట్టు వదలని విక్రమార్కుడిని' అని క్యాప్షన్ తో పాటు సెన్సార్ సర్టిఫికెట్ ను చేతిలో పట్టుకున్న ఫొటోని వర్మ పోస్ట్ చేశాడు. వ్యూహం సినిమా సీక్వెల్ గా 'శపథం' అనే మరో సినిమాను కూడా వర్మ తెరకెక్కించాడు. వ్యూహం విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీని విడుదల చేయనున్నారు. అతి త్వరలో 'శపథం' రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేయనున్నారు.

First Published:  28 Feb 2024 12:34 PM GMT
Next Story