Telugu Global
Cinema & Entertainment

Vishal: మోహన్ బాబు వల్లనే హీరో అయ్యాను

Vishal: సీనియర్ నటుడు మోహన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు హీరో విశాల్. లాఠీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ఆసక్తికర అంశాల్ని వెల్లడించాడు.

Vishal: మోహన్ బాబు వల్లనే హీరో అయ్యాను
X

మోహన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు హీరో విశాల్. తనలో నటుడయ్యే లక్షణాలున్నాయని అందరికంటే ముందు మోహన్ బాబు గుర్తించారని అన్నాడు. లాఠీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మోహన్ బాబును చీఫ్ గెస్ట్ గా పిలిచిన విశాల్.. అతడితో తన చిన్ననాటి జ్ఞాపకాల్ని పంచుకున్నాడు.

"మోహన్ బాబు గారికి నేను మూడో కొడుకుని. నన్ను వాళ్ళ ఇంటి బిడ్డలా ఎప్పుడూ ఆదరిస్తారు. 18 ఏళ్లుగా మీ ఆదరణ వల్ల హీరోగా నిలబడ్డాను. నన్ను ఎంతగానో ఆదరించి విజల్స్ చప్పట్లు కొడుతున్నారు. దీనంతటికీ కారణం.. మోహన్ బాబు గారు. నేను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నప్పుడు 'యం.ధర్మరాజు ఎం.ఎ' షూటింగ్ కి నాన్నగారు తీసుకెళ్ళారు. ఒక మూల నిలబడి మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ గమనిస్తున్నాను. అప్పుడు మోహన్ బాబు గారు నన్ను నాన్న గారిని పిలిచి, ఈ అబ్బాయి మొహంలో కళ ఉంది, తప్పకుండా హీరో అవుతాడని అన్నారు. అలా చెప్పిన మొదటి వ్యక్తి మోహన్ బాబు గారు. అప్పటికి నటుడు అవ్వాలనే ఆలోచన కూడా నాకు లేదు. కానీ మోహన్ బాబు గారు అప్పుడే బలంగా చెప్పారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి."

ఇలా మోహన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు విశాల్. సునైన హీరోయిన్ గా నటించిన లాఠీ సినిమాతో రేపు థియేటర్లలోకి వస్తున్నాడు విశాల్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

First Published:  21 Dec 2022 6:30 AM GMT
Next Story