Telugu Global
Cinema & Entertainment

Virupaksha - రేపే విరూపాక్ష ట్రయిలర్ రిలీజ్

Virupaksha Trailer - సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా విరూపాక్ష. ఈ మూవీ ట్రయిలర్ రేపు రిలీజ్ అవుతోంది.

సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష
X

సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కెరీర్ లో సాయితేజ్ చేస్తున్న తొలి మిస్టరీ థ్రిల్లర్ ఇదే. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స్వయంగా సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సాయితేజ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా రిలీజ్ కూడా ఇదే. తెలుగుతో పాటు.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతోంది విరూపాక్ష సినిమా.

సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. ఇదే ఊపులో ట్రయిలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విరూపాక్ష ట్రయిలర్ రిలీజ్ అవుతుంది.

మరోవైపు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా డేట్ లాక్ చేశారు. ఈనెల16న ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో విరూపాక్ష ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయబోతున్నారు. 21న సినిమా థియేటర్లలోకి వస్తుంది.

First Published:  10 April 2023 2:05 PM GMT
Next Story