Telugu Global
Cinema & Entertainment

Vikram's 62nd Film | వీర ధీర శూరగా విక్రమ్

Vikram's 62nd Film - విక్రమ్ తన 62వ సినిమాను కూడా పూర్తిచేశాడు. ఈ మూవీకి వీర శూర ధీర అనే టైటిల్ పెట్టారు

Vikrams 62nd Film | వీర ధీర శూరగా విక్రమ్
X

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

చియాన్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

‘వీర ధీర శూరన్’లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో పేరు కాళి. అతడు కిరాణా షాప్ ఓనర్ గా కనిిపంచాడు. అయినప్పటికీ అతడి నిజస్వరూపం వేరే ఉంది.

‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌ ఆద్యంతం మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. ఇక చియాన్ విక్ర‌మ్ ఎప్పట్లానే కొత్తగా కనిపించాడు. జి.వి.ప్ర‌కాష్ కుమార్ నేపథ్య సంగీతం అదిరింది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు మేక‌ర్స్.

First Published:  17 April 2024 5:22 PM GMT
Next Story