Telugu Global
Cinema & Entertainment

Family Star | ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్

Family Star - భారీ అంచనాలతో వస్తోంది ఫ్యామిలీ స్టార్. ఆ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

Family Star | ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్
X

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ తో "ఫ్యామిలీ స్టార్" సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇది టికెట్ బుకింగ్స్ లోనూ క్లియర్ గా కనిపిస్తోంది.

థియేటర్స్, మల్టీప్లెక్స్ లో టికెట్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకులు "ఫ్యామిలీ స్టార్" చూడాలనుకుంటున్నారు. పైగా వేసవి శెలవులు కలిసొస్తున్నాయి.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  1 April 2024 2:44 AM GMT
Next Story