Telugu Global
Cinema & Entertainment

Saindhav | సెన్సార్ పూర్తి చేసుకున్న వెంకీ సినిమా

Saindhav Movie - వెంకీ నటించిన 75వ చిత్రం సైంధవ్. ఈ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.

Saindhav | సెన్సార్ పూర్తి చేసుకున్న వెంకీ సినిమా
X

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రం ‘సైంధవ్’. వెంకీ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన సైంధవ్, సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చారు. సైంధవ్ జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్‌కి సిద్ధమైంది.

‘సైంధవ్’ ఓ డిఫరెంట్ యాక్షన్ మూవీ. పాటల్లో చూపించినట్లుగా, తండ్రీకూతుళ్ల బంధం ఈ సినిమాలో ప్రధాన అంశం. ఇందులో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య మెచ్యూర్ రిలేషన్ షిప్ కూడా మనం చూడవచ్చు. తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్‌గా ఉన్న వెంకటేష్‌కి సహాయం చేయడానికి ఆమె వస్తుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా లాంటి ప్రముఖ నటుల ఈ చిత్రంలో కీలక పాత్రల్లో అలరించనున్నారు.

ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్.

సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య రిలీజ్ అవుతోంది సైంధవ్. ఈ సినిమా కంటే ముందు గుంటూరుకారం, హను-మాన్ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు ఈగిల్ వస్తోంది.

First Published:  31 Dec 2023 5:18 PM GMT
Next Story