Telugu Global
Cinema & Entertainment

Varun Tej | యాక్షన్ కంటే ఎమోషన్ నచ్చిందంటున్న వరుణ్ తేజ్

Varun Tej - గాండీవధారి అర్జునపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఇందులో యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ ఉందని చెబుతున్నాడు.

Varun Tej | యాక్షన్ కంటే ఎమోషన్ నచ్చిందంటున్న వరుణ్ తేజ్
X

గాండీవధారి అర్జున సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు వరుణ్ తేజ్. పూర్తిగా యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమా ఇది. అయితే యాక్షన్ కంటే ఇందులో ఎమోషన్ తనకు బాగా నచ్చిందని చెబుతున్నాడు వరుణ్ తేజ్.

"ప్రవీణ్ సత్తారు సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటాను. తన కాన్సెప్ట్స్ లో సెన్సిబిలిటీస్ ఉంటాయి. విభిన్నమైన సినిమాలను చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. చందమామ కథలు, గరుడ వేగ లాంటి సినిమాలను చూశాను. గని సినిమా షూటింగ్ సమయంలో తను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో కథ గురించి నేనేమీ అడగలేదు. యాక్షన్ సినిమా చేద్దాం అన్నాడు. తను యాక్షన్ సినిమా అయితే బాగా చేస్తాడని సరేనని కలిశాను. ప్రవీణ్ కథ చెప్పినప్పుడు తను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని నాకు అర్థమైంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆ సమస్యను ఎవ్వరం పట్టించుకోం. అది వెంటనే మనపైన ప్రభావం చూపేది కాదు. కానీ దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తర్వాత ఉంటుంది. ప్రవీణ్ చెప్పినప్పుడు కథలోని మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి. అందుకే వెంటనే అంగీకరించాను."

రేపు థియేటర్లలోకి వస్తోంది గాండీవధారి అర్జున. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో స్టయిల్, యాక్షన్ ఎక్కువగా ఉంటుందని.. కానీ గాండీవధారి అర్జున సినిమాలో యాక్షన్ తో పాటు మంచి కంటెంట్ కూడా ఉంటుందని అంటున్నాడు వరుణ్ తేజ్.

ఆపత్కాల సమయంలో ఎలాగైతే అర్జునుడు యుద్ధరంగంలోకి దూకి, పరిస్థితిని చక్కదిద్దుతాడో.. అదే విధంగా ఈ సినిమాలో అర్జున్ అనే పాత్ర సరైన టైమ్ లో రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తుంది. అందుకే ఈ సినిమాకు గాండీవధారి అర్జున అనే టైటిల్ పెట్టారంట.

First Published:  24 Aug 2023 2:25 AM GMT
Next Story