Telugu Global
Cinema & Entertainment

Varun Sandesh | కొత్త సినిమా స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్

Varun Sandesh - కొత్త ఏడాదిలో కొత్త సినిమా లాంచ్ చేశాడు వరుణ్ సందేశ్. ఆ మూవీ విశేషాలు చూద్దాం.

Varun Sandesh | కొత్త సినిమా స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్
X

వరుణ్ సందేశ్ హీరోగా ఎమ్3 మీడియా, మహా మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమా ద్వారా శ్రీ అద్యాన్త్ హర్ష డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమం అనంతరం ముహూర్తపు షాట్ కి హీరో వరుణ్ సందేశ్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ అజయ్ కుమార్ మొదటి షాట్ చిత్రీకరించారు.

సరికొత్త కథాంశంతో ఈ సినిమా రాబోతోందంట. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయని.. తను ఇప్పటివరకు ఇలాంటి సినిమాలో నటించలేదని చెబుతున్నాడు వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఇప్పటివరకు నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట.

ఇది లవ్ స్టోరీ కాదు. డిఫరెంట్ స్టోరీలైన్ తో వస్తున్న థ్రిల్లర్ మూవీ. హీరో క్యారెక్టరైజేష్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అంటున్నాడు దర్శకుడు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాను, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.

ఈ సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, రాఘవ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారు. కొత్త ఏడాదిలో వరుణ్ తేజ్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా ఇదే.

First Published:  2 Jan 2024 5:26 PM GMT
Next Story