Telugu Global
Cinema & Entertainment

Sabari Movie | శబరి ప్రయాణం అలా మొదలైందంటున్న వరలక్ష్మి

Varalaxmi - శబరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వరలక్ష్మి. ఈ సినిమా విశేషాల్ని పంచుకుంది.

Sabari Movie | శబరి ప్రయాణం అలా మొదలైందంటున్న వరలక్ష్మి
X

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. 'శబరి' ప్రయాణం ఎలా, ఎప్పుడు మొదలైందో వివరించారు.

"క్రాక్ సినిమాకు సంతకం చేయడానికి ముందు 'శబరి' కథ విన్నా. నాకు బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. అయితే, షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశా. టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు."

శబరి సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్ గా చెప్పుకొచ్చింది వరలక్ష్మి. తల్లీకూతురు మధ్య ఉండే ప్రేమానురాగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. సినిమాలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెబుతోంది.

First Published:  24 April 2024 5:16 PM GMT
Next Story