Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: చిరంజీవి, రవితేజ మధ్యలో ఊర్వశి

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఊర్వశి రుథేలా ఇందులో డాన్స్ చేసింది.

Waltair Veerayya: చిరంజీవి, రవితేజ మధ్యలో ఊర్వశి
X

చిరంజీవి నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయంటోంది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి, రవితేజ పై ఓ మాస్ సాంగ్ షూట్ చేశారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరిగింది.

ఈ సెట్ లో చిరంజీవి, రవితేజతో కలిసి ఐటెం భామ ఊర్వశి రౌతేలా డాన్స్ చేసింది. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మంచి ఐటెంసాంగ్ కంపోజ్ చేయగా.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సందడి చేయబోతోంది.




First Published:  6 Nov 2022 4:33 AM GMT
Next Story