Telugu Global
Cinema & Entertainment

Upasana | అత్తమ్మ కిచెన్ ప్రారంభించిన ఉపాసన

Upasana - తన నేతృత్వంలో అత్త సురేఖ కోసం, అత్తమ్మ కిచెన్ అనే కొత్త వ్యాపారం ప్రారంభించారు ఉపాసన కొణెదల.

Upasana | అత్తమ్మ కిచెన్ ప్రారంభించిన ఉపాసన
X

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను, రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు.

చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుంది.

ప్రస్తుతానికి అత్తమ్మ కిచెన్ ను ఆన్ లైన్ విక్రయాల వరకు మాత్రం పరిమితం చేశారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఔట్ లెట్స్ ఏర్పాటు చేస్తారు. పనిలోపనిగా అమెరికాలో కూడా ఓ కౌంటర్ తెరుస్తారు. ఈ వెబ్ సైట్ లో ప్రస్తుతానికి 4 రకాల రెసిపీలను మాత్రమే అందుబాటులో ఉంచారు. వాటిని విడివిడిగా కొనడం కుదరదు. కాంబో ఆఫర్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. త్వరలోనే మరిన్ని సంప్రదాయ రుచుల్ని సురేఖ కిచెన్ నుంచి బాహ్య ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు ఉపాసన.

First Published:  18 Feb 2024 2:04 PM GMT
Next Story