Telugu Global
Cinema & Entertainment

Upasana | మరో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ

Upasana - ఈమధ్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీగా ఉన్నట్టు ప్రకటించింది.

Upasana | మరో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ
X

పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. ఇంకా చెప్పాలంటే పెళ్లయిన 8 ఏళ్లకు చరణ్-ఉపాసన దంపతులకు పాప పుట్టింది. ఆమెకు క్లీంకార అనే పేరు పెట్టుకొని, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

ఇప్పటివరకు క్లీంకార ముఖం ఎలా ఉంటుందో కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు. ఎన్ని ఫొటోలు బయటకొచ్చినా, వాటిలో పాప ఫేస్ కనిపించకుండా బయటపడ్డారు. చివరికి ఎయిర్ పోర్టు ఫొటోల్లో కూడా క్లీంకార కనిపించలేదు.

ఓవైపు ఇలా క్లీంకార పెంపకంలో బిజీగా ఉంటూనే మరో కీలక ప్రకటన చేశారు ఉపాసన కొణెదల. తను మరో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అని ప్రకటించారు. అయితే ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని, చరణ్ ఎలా ఫీలవుతున్నాడో తనకు తెలియదని అంటున్నారు.

పెళ్లి తర్వాత పిల్లల కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్న ఉపాసన-చరణ్.. ఈసారి అలాంటి గ్యాప్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన ప్రకటించారు. తన వైద్యుల సూచనలు-సలహాలతో వీలైనంత త్వరగా మరోసారి తల్లి అయ్యేందుకు తను తహతహలాడుతున్నానని తెలిపారు.

First Published:  21 Feb 2024 5:42 PM GMT
Next Story