Telugu Global
Cinema & Entertainment

Samantha: సమంత తల్లి పాత్రలో మరో స్టార్ హీరోయిన్

Tabu-Samantha: సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమాలో టబు ఓ కీలక పాత్ర పోషించనుందని సమాచారం.

Samantha: సమంత తల్లి పాత్రలో మరో స్టార్ హీరోయిన్
X

ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల కోసం కూడా స్టార్ నటీనటులు రెడీ అయిపోతున్నారు. నదియ, మీనా, ఖుష్బూ, మధుబాల.. ఇలా చాలామంది క్యారెక్టర్ రోల్స్ కి షిప్ట్ అయిపోయారు. ఈ లిస్ట్ లోకి ఎప్పుడో చేరిపోయింది టబు. అయితే మిగతా హీరోయిన్లలా వరుసపెట్టి సినిమాలు చేయడం టబుకి ఇష్టం ఉండదు. క్యారెక్టర్ నచ్చితేనే చేస్తుంది.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత మళ్లీ కనిపించని ఈ నటి, ఇప్పుడు సమంత సినిమాతో తెరపైకొచ్చే అవకాశం ఉంది. అవును.. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమాలో టబు నటించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో సమంతకు తల్లిగా ఆమె కనిపించనుందంట.

టబు పాత్ర సినిమా సెకెండాఫ్ లో వస్తుందట. చాలా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర, సినిమాను మలుపు తిప్పుకుందని అంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతానికి ఆపేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత, కొన్నాళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చింది.

ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఖుషి సినిమా సెట్స్ పైకి వస్తుంది. అప్పుడు ఈ ప్రాజెక్టులో టబు ఉందా లేదా అనే అంశంపై క్లారిటీ వస్తుంది.




First Published:  20 Dec 2022 5:30 AM GMT
Next Story