Telugu Global
Cinema & Entertainment

మైఖేల్ నిజంగానే అదరగొట్టేశాడు

తన కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశాడు సందీప్ కిషన్. ఆ సినిమా పేరు మైఖేల్. టీజర్ ఎలా ఉందో చూద్దాం.

మైఖేల్ నిజంగానే అదరగొట్టేశాడు
X

సందీప్ కిషన్ హీరోగా, రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకక్కుతున్న చిత్రం 'మైఖేల్'. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా మూవీ ఇది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు. నాని తెలుగు వెర్షన్ విడుదల చేయగా, ధనుష్ తమిళ వెర్షన్‌ను, దుల్కర్ సల్మాన్ మలయాళ వెర్షన్‌ను, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు. హిందీ టీజర్‌ను రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ విడుదల చేశారు.

'మైఖేల్' షేడ్స్ ను ఎలివేట్ చేసింది టీజర్. అలాగే, విజయ్ సేతుపతి పాత్రతో పాటు గౌతమ్ మీనన్ విలనిజం చూపించింది. 80వ దశకం నేపథ్యాన్ని టీజర్ లో బాగా చూపించారు.

సినిమాలోని 3 ముఖ్యమైన పాత్రల్ని పరిచయం చేస్తూ ప్రారంభమైంది టీజర్. ''వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్' అని మాస్టర్ చెప్పగా .. 'వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పని లేదు మాస్టర్'' అని మైఖేల్ బదులు ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి , గౌతమ్ మీనన్ ల గెటప్స్, యాక్షన్ ఎపిసోడ్‌లు, డైలాగులు ఈ టీజర్ లో కనిపించాయి. వీళ్లతో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ , అనసూయ పాత్రల్ని కూడా టీజర్ లో చూపించారు.

కిరణ్ కౌశిక్ తీసిన విజువల్స్, శామ్ సీఎస్ నేపథ్య సంగీతం టీజర్ ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.



First Published:  21 Oct 2022 3:43 AM GMT
Next Story