Telugu Global
Cinema & Entertainment

Pedda Kapu 1 | శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎంతవరకు వచ్చింది?

Pedda Kapu 1 - శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది పెద కాపు-1. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొలాచ్చిలో జరుగుతోంది.

Peddha Kapu 1 Teaser | పెదకాపు టీజర్ ఎలా ఉందంటే..!
X

Peddha Kapu 1 Teaser | పెదకాపు టీజర్ ఎలా ఉందంటే..!

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న పొలిటికల్ డ్రామా ’పెద్ద కాపు-1’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలోని చివరి పాట షూటింగ్ తాజాగా పొల్లాచ్చిలో జరుగుతోంది. లీడ్ పెయిర్ పై గ్రాండ్ గా చిత్రీకరిస్తున్న ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రంలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనాన్ని మునుపెన్నడూ చేయని విధంగా చాలా కొత్తగా ప్రజంట్ చేశాడు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. మిక్కీ జే మేయర్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగల్ ‘చనువుగా చూసిన’ పాట ఆకట్టుకుంది.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ప్రముఖ యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. రావు రమేష్, నాగబాబు, రాజీవ్ కనకాల, అనుసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

First Published:  10 Aug 2023 3:35 PM GMT
Next Story