Telugu Global
Cinema & Entertainment

Srikanth Addala - లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల నుంచి మరో మూవీ

Srikanth Addala - నారప్ప సినిమా తర్వాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల, ఎట్టకేలకు కొత్త సినిమా ప్రకటించాడు.

Srikanth Addala - లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల నుంచి మరో మూవీ
X

శ్రీకాంత్ అడ్డాల నుంచి సినిమా వచ్చి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో 2016లో బ్రహ్మోత్సవం తీశాడు, ఆ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని నారప్ప అనే రీమేక్ ప్రాజెక్టు తీశాడు. ఆ తర్వాత మెగా కాంపౌండ్ లో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరిగినప్పటికీ అది వర్కవుట్ కాలేదు.

మళ్లీ ఇన్నేళ్లకు తెరపైకొచ్చాడు ఈ సెన్సిబుల్ డైరక్టర్. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో కొత్త సినిమా చేస్తున్నాడు. జూన్ 2న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో రక్తం గుర్తులతో ఉన్న చేతిని మనం చూడవచ్చు.

‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ అందుకుంది ద్వారకా క్రియేషన్స్ సంస్థ. దీంతో ఈ సంస్థ నుంచి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇందులో హీరో ఎవరనేది తెలియాలంటే, 2వ తేదీ వరకు ఆగాల్సిందే.




First Published:  30 May 2023 12:11 PM GMT
Next Story