Telugu Global
Cinema & Entertainment

SreeVishnu | శ్రీవిష్ణు కొత్త సినిమా సంగతులు

SreeVishnu - తన కొత్త సినిమాలో డిటెక్టివ్ గా కనిపించబోతున్నాడు శ్రీవిష్ణు. షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది.

SreeVishnu | శ్రీవిష్ణు కొత్త సినిమా సంగతులు
X

వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, ఓం భీమ్ బుష్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఈరోజు ప్ర‌క‌టించాడు.

హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘సామజవరగమన’ చిత్రంలో శ్రీవిష్ణుకి జంట‌గా న‌టించిన రెబా జాన్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీ ఇప్ప‌టికే 60 శాతం పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచి డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నాడు. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ జానర్ ను ఎంచుకున్నాడు. ఇందులో అతడు డిటెక్టివ్ గా కనిపించబోతున్నాడు. కాకపోతే కామెడీనా, సీరియస్ సినిమానా అనేది మాత్రం ప్రస్తుతానికి చెప్పలేదు.

విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నాడు. కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌.

First Published:  17 April 2024 5:13 PM GMT
Next Story