Telugu Global
Cinema & Entertainment

Sreeleela - ప్రభాస్ సరసన శ్రీలీల

Sreeleela - శ్రీలీల మరో బంపరాఫర్ కు దగ్గరగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ సరసన మెరవనుంది ఈ బ్యూటీ.

Sreeleela - ప్రభాస్ సరసన శ్రీలీల
X

ప్రభాస్ చేయబోయే ప్రాజెక్టుల లిస్ట్ చాలానే ఉంది. వాటిలో హను రాఘవపూడి సినిమా కూడా ఒకటి. సీతారామం సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన ఈ దర్శకుడితో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రీలీలను తీసుకుంటున్నారట. ఈ మేరకు హను రాఘవపూడి, స్వయంగా శ్రీలీలను సంప్రదించడం విశేషం. కానీ ఆమె ఇంకా సంతకం చేయలేదు. ఆమె పేరును కూడా మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

అయితే, ప్రభాస్ అభిమానులు మాత్రం ఊరుకోలేదు. ఆమెకు వ్యతిరేకంగా హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు, ఆమెను సినిమాలోకి తీసుకోవద్దంటూ డిమాండ్స్ చేస్తున్నారు.

శ్రీలీల అందంగా ఉంటుంది, డాన్స్ ఇరగదీస్తుంది. కానీ ఈమధ్య వరుసగా ఫ్లాపులిస్తోంది. గుంటూరుకారంతో ఆమెపై నెగెటివ్ బాగా ప్రచారం అవుతోంది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ సరసన శ్రీలీల అనే ఫీలర్ బయటకు రావడంతో, అతడి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ట్రోలింగ్ సంగతి పక్కనపెడితే, ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే మాత్రం శ్రీలీల బంపరాఫర్ కొట్టినట్టే.

First Published:  28 Jan 2024 3:05 AM GMT
Next Story