Telugu Global
Cinema & Entertainment

SreeLeela - హిట్ సినిమాను మిస్ చేసుకుంది

SreeLeela Chalo Movie - లెక్కప్రకారం ఛలో సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఈ విషయాన్ని నాగశౌర్య బయటపెట్టాడు.

SreeLeela - హిట్ సినిమాను మిస్ చేసుకుంది
X

హీరోలు, హీరోయిన్లు మంచి సినిమాలు మిస్ అవ్వడం కామన్. ప్రతి నటుడి కెరీర్ లో ఇలాంటి అనుభవాలున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి శ్రీలీల చేరింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ బ్యూటీ. అయితే లెక్కప్రకారం ఆమె డెబ్యూ మూవీ అది కాదు. ఛలో సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయం అవ్వాల్సింది.

ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగశౌర్య వెల్లడించాడు. ఛలో సినిమా కోసం శ్రీలీలను అనుకున్నారట. ఆమెను సంప్రదించారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఛలో సినిమాలో నటించలేకపోయింది శ్రీలీల. దీంతో ఆ అవకాశం రష్మికను వరించింది. అలా ఛలోతో సూపర్ హిట్ కొట్టింది రష్మిక. లేదంటే ఆ స్థానంలో శ్రీలీల ఉండాల్సింది.

అయితే ఛలో మిస్సయినా శ్రీలీలకు అదృష్టం కలిసొచ్చింది. ఫ్లాప్ మూవీ పెళ్లిసందడితో కూడా క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది ఈ బ్యూటీ. తెలుగులో వరుసపెట్టి అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ధమాకాతో సూపర్ హిట్ కొట్టింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరంటే శ్రీలీల మాత్రమే. ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల సినిమాలున్నాయి.

First Published:  29 Jun 2023 4:38 AM GMT
Next Story