Telugu Global
Cinema & Entertainment

SreeLeela: రామ్ తో జాయిన్ అయిన శ్రీలీల

SreeLeela: ధమాకాతో హిట్ కొట్టిన శ్రీలీల, కొత్త సినిమా స్టార్ట్ చేసింది. రామ్-బోయపాటి మూవీ సెట్స్ లోకి ఎంటరైంది ఈ బ్యూటీ.

SreeLeela: రామ్ తో జాయిన్ అయిన శ్రీలీల
X

'అఖండ' తర్వాత బోయపాటి శ్రీను, రామ్ హీరోగా ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలున్నాయి.

హీరో రామ్ కి జోడీగా టాలీవుడ్ మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ను సెలక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

రామ్ ని పూర్తి మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు బోయపాటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

బోయపాటి సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. అటు రామ్ నటించిన చాలా సినిమాలు హిందీలో హిట్టయ్యాయి. దీంతో ఈ తాజా ప్రాజెక్టును నేరుగా హిందీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు.

First Published:  6 Jan 2023 6:30 AM GMT
Next Story