Telugu Global
Cinema & Entertainment

Salaar | సలార్ ఐటెంసాంగ్ డీటెయిల్స్

Salaar - ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. ఈ సినిమాకు ఆఖరి నిమిషంలో ఐటెంసాంగ్ యాడ్ చేశారు.

Salaar | సలార్ ఐటెంసాంగ్ డీటెయిల్స్
X

సలార్ ఐటమ్ సాంగ్ లో సిమ్రత్ కౌర్ కనిపించనుంది. ప్రభాస్ రాబోయే పాన్-ఇండియన్ చిత్రం సలార్ షూటింగ్ చాన్నాళ్ల కిందటే పూర్తయిందనే విషయం తెలిసిందే. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనుకున్నాడు. అలాగే, సినిమాలో స్పెషల్ సాంగ్‌ని చొప్పిస్తే బాగుంటుందని భావించాడు.

తాజా సమాచారం ప్రకారం, సలార్ లో ఐటెంసాంగ్ ను తాజాగా పిక్చరైజ్ చేశారు. దీని కోసం బాలీవుడ్ నటి సిమ్రత్ కౌర్ ను తీసుకున్నారు. సాలార్ ఐటెం సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో 3 రోజుల పాటు కొనసాగుతుంది. సిమ్రత్ కౌర్ ఆల్రెడీ సెట్స్ లో జాయిన్ అయింది. ఆన్ లొకేషన్ స్టిల్ ను కూడా షేర్ చేసింది.

ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. డిసెంబర్ 1న ట్రయిలర్ విడుదల చేయబోతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

KGF సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, సలార్ కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

First Published:  10 Nov 2023 5:04 PM GMT
Next Story