Telugu Global
Cinema & Entertainment

Tillu Square | నిరాశపరచనంటున్న హీరో

Tillu Square - టిల్లూ స్క్వేర్ నుంచి రిలీజ్ ట్రయిలర్ వచ్చేసింది. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని చెబుతున్నాడు హీరో సిద్ధు.

Tillu Square | నిరాశపరచనంటున్న హీరో
X

టిల్లూ స్క్వేర్ తో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా అతడికి చాలా ప్రతిష్టాత్మకం. డీజే టిల్లూకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీతో అతడు తన మార్కెట్ ను నిలుపుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

ఇలాంటి టైమ్ లో టిల్లూ స్క్వేర్ పై ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు సిద్ధు జొన్నలగడ్డ. సీక్వెల్ అంటే ముందు భయపడ్డానని, కానీ అనుకున్నది సాధించానని చెబుతున్నాడు.

"సీక్వెల్ అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను. మొదటి పార్ట్ లా ఉండకూడదు, కానీ అదే స్థాయిలో వినోదాన్ని పంచాలి. అలాగే టిల్లు పాత్రలో ఉన్న సోల్ మిస్ అవ్వకూడదు. హీరోయిన్ పాత్ర కూడా మొదటి పార్ట్ లాగే బాగా ఫేమస్ అవ్వాలి. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాం. అయినా మొదట కాస్త భయపడ్డాం. యుద్ధం గెలుస్తామో లేదో మన చేతుల్లో ఉండదు.. కానీ పోరాటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది నమ్మే మా టీం అంతా టిల్లు స్క్వేర్ కోసం శాయశక్తులా కృషి చేశాం. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మాకు సంతృప్తి కలిగింది. మొదటి పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది."

ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయంటున్నాడు సిద్ధు. మార్చి 29న థియేటర్లకు వచ్చి ఆ థ్రిల్స్ ఎంజాయ్ చేయాలని చెబుతున్నాడు.

First Published:  28 March 2024 3:05 AM GMT
Next Story