Telugu Global
Cinema & Entertainment

Takkar Movie - సిద్దార్థ్ హీరోగా టక్కర్ మూవీ, టీజర్ రిలీజ్

Siddharth Takkar Movie - సిద్దార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం టక్కర్. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది.

Takkar Movie - సిద్దార్థ్ హీరోగా టక్కర్ మూవీ, టీజర్ రిలీజ్
X

స్మాల్ గ్యాప్ తర్వాత హీరో సిద్ధార్థ్ 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. మే 26న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.

తాజాగా 'టక్కర్' మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన టక్కర్ టీజర్ బాగుంది. "నేనంటే ఇష్టం లేదా", "లవ్ అంటేనే ఇష్టంలేదు" అంటూ హీరోహీరోయిన్ల సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన టీజర్ ఆసక్తికరంగా సాగింది.

ఇక టీజర్ లో సిద్ధార్థ్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెబుతున్నారు మేకర్స్.

అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు నివాస్ కె. ప్రసన్న సంగీతం అందించాడు. మహాసముద్రం తర్వాత సిద్దార్థ్ నుంచి వస్తున్న సినిమా ఇదే.



First Published:  18 April 2023 2:48 AM GMT
Next Story