Telugu Global
Cinema & Entertainment

Kannappa | కన్నప్ప ప్రాజెక్టులోకి మరో పెద్ద హీరో

Kannappa Movie - మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలోకి ఇప్పటికే ప్రభాస్, మోహన్ లాల్ చేరారు. ఇప్పుడు మరో పెద్ద నటుడు కూడా వచ్చి చేరాడు.

Kannappa | కన్నప్ప ప్రాజెక్టులోకి మరో పెద్ద హీరో
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రోజురోజుకూ స్థాయిని పెంచుకుంటూపోతోంది. కన్నప్ప నుంచి వస్తోన్న అప్ డేట్స్, ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కన్నప్ప చిత్రం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నప్ప సినిమాలో ఆల్రెడీ చేరారు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో పెద్ద హీరో చేరాడు.

తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ‘కన్నప్ప’ జర్నీలోకి వచ్చాడు. మరో ముఖ్య పాత్రలో శివ రాజ్‌కుమార్ కనిపించబోతోన్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. హీరో మంచు విష్ణు ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు.

ప్రభాస్, మోహన్ లాల్ తో పాటు, శివరాజ్ కుమార్ రావడంతో.. కన్నప్ప వెయిట్ మరింత పెరిగింది. త్వరలోనే ఈ ప్రాజెక్టులోకి నయనతార కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో నడుస్తోంది. దాదాపు 600 మంది ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్టు మంచు విష్ణు ఆల్రెడీ ప్రకటించాడు.

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు.


First Published:  12 Oct 2023 5:16 PM GMT
Next Story