Telugu Global
Cinema & Entertainment

Amaran | శివకార్తికేయన్ సినిమా టైటిల్ ఇదే

Amaran Movie - శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, టీజర్ ను ప్రకటించారు. ఈ సినిమాకు అమరన్ అనే పేరు పెట్టారు.

Amaran | శివకార్తికేయన్ సినిమా టైటిల్ ఇదే
X

హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి "అమరన్" అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకక్కుతున్న ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో, రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” సిరీస్‌లోని ఒక అధ్యాయం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

రచయిత-దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి "అమరన్" చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే కోసం చాలా రిసెర్చ్ చేశాడు.

హీరో శివకార్తికేయన్.. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ అవతార్ లో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

జివి ప్రకాష్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. సీహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

'మేజర్' లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ, 'అమరన్'తో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇది కూడా దేశభక్తి చిత్రమే కావడం విశేషం.

First Published:  17 Feb 2024 1:14 PM GMT
Next Story