Telugu Global
Cinema & Entertainment

Jawan - రూ.250 కోట్లకు అమ్ముడుపోయిన షారూక్ సినిమా

Jawan Movie - షారూక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జవాన్. నయనతార హీరోయిన్. ఇప్పుడీ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి

Jawan - రూ.250 కోట్లకు అమ్ముడుపోయిన షారూక్ సినిమా
X

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘జవాన్’. ప్ర‌పంచవ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాతో పాటు ప్రసారం చేయబోతున్నారు.

ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్.. తాజాగా మరో రికార్డ్ సెట్ చేసింది. ట్రైల‌ర్ ఇంకా రిలీజ్ కాక‌ముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం. యాక్ష‌న్ ఎలిమెంట్స్, న‌టీన‌టుల అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన జ‌వాన్ ట్రైల‌ర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సాధార‌ణంగానే షారూక్ ఖాన్ సినిమాల‌కు సంబంధించిన హ‌క్కులన్నీ ఫ్యాన్సీ రేట్ల‌కే అమ్ముడ‌వుతుంటాయి. అయితే పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, జవాన్ రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ను జియో సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. షారూక్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యానర్ పై స్వయంగా షారూక్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

First Published:  7 July 2023 4:49 PM GMT
Next Story