Telugu Global
Cinema & Entertainment

Jawan Trailer | షారూక్ సినిమా జవాన్ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

Jawan Trailer - షారూక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమా నుంచి ట్రయిలర్ రిలీజైంది. అంచనాల్ని మరింత పెంచింది.

Jawan Trailer | షారూక్ సినిమా జవాన్ ట్రయిలర్ ఎలా ఉందంటే..?
X

ఎట్టకేలకు ఎన్నో రోజులుగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జవాన్' ట్రైలర్ విడుదలైంది. అట్లీ దర్శకుడు. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్ గా మెప్పించనున్నాడు.

ఈరోజు నయనతార ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టింది. ఇది ఆమె అభిమానులకు ఎంతో ఆనందకరమైన విషయం. తన ఇనస్టా ఎకౌంట్ లో జవాన్ ట్రయిలర్ పోస్ట్ చేసింది నయనతార. రేపట్నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

రీసెంట్ గా 'జవాన్ ప్రివ్యూ' పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. ఈ క్రమంలో విడుదలైన జవాన్ ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది.

యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ జవాన్ లో పుష్కలంగా ఉన్నాయనే విషయాన్ని ట్రయిలర్ తో చెప్పకనే చెప్పారు. ట్రైలర్ ను గమనిస్తే అందులోని విజువల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలనే ఫీలింగ్ ను కలిగిస్తోంది. సెప్టెంబర్ 7న రాబోతున్న జవాన్ సినిమా, ప్రేక్షకులందరికీ మంచి థియేట్రిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని చెబుతున్నారు మేకర్స్.

అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అతడు కంపోజ్ చేసిన పాటలకు పెద్దగా రెస్పాన్స్ రానప్పటికీ, ట్రయిలర్ క్లిక్ అవ్వడంతో, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

First Published:  31 Aug 2023 2:19 PM GMT
Next Story