Telugu Global
Cinema & Entertainment

Jawan | లుంగీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న షారూక్

Shahrukh Lungi sentiment - చెన్నై ఎక్స్ ప్రెస్ లో లుంగీ సాంగ్ ఉంది. ఇప్పుడు జవాన్ కోసం కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు షారూక్

Jawan | లుంగీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న షారూక్
X

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కి లుంగీతో ఉన్న అనుబంధం ప్ర‌త్యేక‌మైంది. గ‌తంలో ఆయ‌న హీరోగా న‌టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్పుడే కాదు రీసెంట్‌గా రిలీజైన జ‌వాన్ సినిమాలో దుమ్మే దులిపేలా ... సాంగ్‌లోనూ లుంగీ చూపించాడు షారూఖ్‌. ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ పొజిషన్ లో ఉంది.

యాదృచ్చికంగానే జ‌రిగినా సాంగ్ లో లుంగీ చూపించడం షారూఖ్‌ కి ల‌క్ తీసుకొచ్చింది. షారూక్‌ఖాన్ ప‌వ‌ర్‌తో పాటు లుంగీ కూడా ల‌క్ కూడా తోడైంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వెయ్యి మందికి పైగా బ్యాగ్రౌండ్ డాన్స‌ర్స్ లుంగీ క‌ట్టుకుని డాన్స్ చేయ‌టం వ‌ల్ల పాట‌ మరింత స్పెషల్ గా మారింది.

ఇక జవాన్ సినిమాకు సంబంధించి మరో ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉంది. చెన్నై ఎక్స్ ప్రెస్ లో మెరిసిన ప్రియమణి, జవాన్ సినిమాలో కూడా నటించింది. ఈ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ‘జ‌వాన్‌’ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

తాజాగా పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు షారూక్. బాలీవుడ్ లో హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా పఠాన్ నిలిచింది. ఇప్పుడీ సినిమా రికార్డుల్ని, జవాన్ తో క్రాస్ చేయాలని భావిస్తున్నాడు షారూక్.

Shah

First Published:  7 Aug 2023 1:33 PM GMT
Next Story