Telugu Global
Cinema & Entertainment

SatyaDev: రెమ్యూనరేషన్ రెట్టింపు

హీరో సత్యదేవ్ ప్రస్తుతం మంచి జోరుమీదున్నాడు. చిరంజీవి, అక్షయ్ కుమార్ లాంటి నటులతో కలిసి పనిచేయడం ఈ హీరోకు కలిసొచ్చింది.

SatyaDev: రెమ్యూనరేషన్ రెట్టింపు
X

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్. హీరోగా ఫ్లాపులు వచ్చినప్పటికీ, చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమా చేయడం, అటు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి రామ్ సేతు సినిమా చేయడం ఈ హీరోకు కలిసొచ్చింది.

నిజానికి ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ సత్యదేవ్ కు మాత్రం గుర్తింపు రావడం అతడి అదృష్టం. ఈ రెండు సినిమాలు ఇచ్చిన గుర్తింపుతో, ఇప్పుడీ హీరో తన పారితోషికాన్ని సవరించాడు.

తాజా సమాచారం ప్రకారం, ఒక్కో సినిమాకు సత్యదేవ్ కోటి 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అతడు నటించిన ఫుల్ బాటిల్ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది.

శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా సక్సెస్ అయితే సత్యదేవ్ మరోసారి తన రేటును పెంచడం గ్యారెంటీ. అందుకే ఫుల్ బాటిల్ రిలీజ్ కోసం ఈ హీరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

మరోవైపు సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా కష్టాల్లో పడింది. ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. అటు డాలీ ధనుంజయ్ తో కలిసి అతడు చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

First Published:  2 Nov 2022 3:09 AM GMT
Next Story