Telugu Global
Cinema & Entertainment

Prabhas: ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్?

Sanjay Dutt-Prabhas: ప్రభాస్ కొత్త సినిమాలో సంజయ్ దత్ నటించబోతున్నాడా? ఇప్పుడిదే టాలీవుడ్ హాట్ టాపిక్. ఇంతకీ ఏ సినిమాలో?

Prabhas: ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ హీరో నటించే సినిమాలో మరో పెద్ద నటుడు కనిపిస్తే ఆ కిక్కే వేరు. అతడే సంజయ్ దత్. ఇప్పుడీ ఇద్దరూ కలిశారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారు. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ఉంది.

యాక్షన్ కు పెట్టింది పేరు సంజయ్ దత్. ఇక ప్రభాస్ యాక్షన్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి ఇద్దరు యాక్షన్ స్టార్లు కలిస్తే అదిరిపోయే యాక్షన్ బ్లాక్ గ్యారెంటీ. కానీ దీనికి పూర్తి రివర్స్ లో ఉండబోతోంది వ్యవహారం.

మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇదొక హారర్ కామెడీ. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారట. సినిమాలో ప్రభాస్-సంజయ్ దత్ మధ్య హిలేరియస్ హారర్ కామెడీ పండించబోతున్నాడ మారుతి.

అలా ఇద్దరు యాక్షన్ స్టార్లు కలిసి, ఓ కొత్త సినిమాలో సరికొత్త కామెడీ పండించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్-మారుతి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఆచార్య సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్ లోని ఓ ఇంట్లో ఈ షూటింగ్ నడుస్తోంది.

ఈ ప్రాజెక్టులోకి సంజయ్ దత్ వచ్చాడా లేదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తోంది.

First Published:  20 Dec 2022 8:30 AM GMT
Next Story