Telugu Global
Cinema & Entertainment

Samyukta Menon | స్వయంభూ కోసం గుర్రపు స్వారీ చేసిన హీరోయిన్

Samyukta Menon - హీరోయిన్ సంయుక్త మీనన్, గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. స్వయంభూ సినిమాలో ఆమె యుద్ధాలు చేయబోతోంది.

Samyukta Menon | స్వయంభూ కోసం గుర్రపు స్వారీ చేసిన హీరోయిన్
X

హీరో నిఖిల్ తన 20వ చిత్రం స్వయంభూలో లెజెండరీ యోధుడి పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో కళ్లుచెదిరే యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయి.

అతనితో పాటు నటి సంయుక్త మీనన్ కూడా కొన్ని స్టంట్స్ చేయబోతోంది. దీనికోసం ఆమె కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. “నా తదుపరి చిత్రం స్వయంభూ కోసం, నేను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. ఇది ఓ అద్భుత ప్రయాణం.'' అని తెలిపింది సంయుక్త.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతోంది ఈ సినిమా.

రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. నిఖిల్‌తో పాటు ఇతర తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కీలకంగా మారనున్నాయి.

First Published:  11 Feb 2024 2:42 PM GMT
Next Story