Telugu Global
Cinema & Entertainment

Samuthirakani | సముద్రఖని లీడ్ రోల్ లో సినిమా

Samuthirakani - ఇప్పటికే విమానం అనే సినిమా చేశాడు సముద్రఖని. ఇప్పుడు తను లీడ్ రోల్ లో మరో సినిమా చేస్తున్నాడు.

Samuthirakani | సముద్రఖని లీడ్ రోల్ లో సినిమా
X

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ద్విభాష చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటుడు ధనరాజ్, ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. క్లాప్ శివబాలాజీ, కెమెరా సోలో బతుకె సో బెటర్ డైరెక్టర్ డైరెక్టర్ సుబ్బు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం వేణు చేశారు. అలాగే అమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయగా, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్ ను యూనిట్ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్ , భూపాల్, పృద్వి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, పృద్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ-మాటలు సమకూరుస్తున్నాడు.

ఎవరూ టచ్ చేయని ఒక తండ్రికొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. శశి చిత్ర సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో ్హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు మంచి ఫన్ ఉంటుందని చెబుతున్నాడు దర్శకుడు కమ్ నటుడు ధనరాజ్.

First Published:  23 Oct 2023 3:02 PM GMT
Next Story