Telugu Global
Cinema & Entertainment

Sameera Reddy | మంచి పాత్రల కోసం వెయిటింగ్

Sameera Reddy - ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సమీరా రెడ్డి రీఎంట్రీకి రెడీ అని ప్రకటించింది. మంచి రోల్స్ కోసం ఎదురుచూస్తోంది.

Sameera Reddy | మంచి పాత్రల కోసం వెయిటింగ్
X

సమీరారెడ్డి.. ఈ హీరోయిన్ కు పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఈమె. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్, ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి వస్తానంటోంది. ఐయామ్ రెడీ అంటూ ప్రకటించింది.

రీఎంట్రీలో మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తోంది సమీరా రెడ్డి. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ, క్రైమ్.. ఇలా జానర్ ఏదైనా అందులో తన పాత్ర బాగుండాలని, అలాంటి మంచి కథలు దొరికితే కచ్చితంగా సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. అయితే ఈ క్రమంలో పాత్ర నిడివిపై తనకు ఎలాంటి కండిషన్స్ లేవని కూడా చెబుతోంది. కథకు కీలకంగా ఉండే పాత్ర లభిస్తే, అది నిమిషం నిడివి క్యారెక్టర్ అయినా చేస్తానంటోంది.

తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి హీరోలతో కలిసి సినిమాలు చేసింది సమీరా రెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలెవ్వరితో తను టచ్ లో లేనని, త్వరలోనే అందరితో టచ్ లోకి వస్తానని చెబుతోంది. మరీ ముఖ్యంగా తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ను కలవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రకటించింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని, ఆ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పట్నుంచి ఎన్టీఆర్ ను కలవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రకటించింది సమీరా రెడ్డి. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించడం తన ప్రస్తుత కలగా చెప్పుకొచ్చింది.

మొత్తమ్మీద తన రీఎంట్రీని సమీరారెడ్డి కన్ ఫర్మ్ చేసింది. అన్నీ సెట్ అయి, మంచి కథ, బ్యానర్ కుదిరితే ఆమె త్వరలోనే తెలుగు సినిమాలో కనిపించడం ఖాయం. అయితే మొన్నటివరకు హాట్ హీరోయిన్ గా కనిపించిన ఈ బ్యూటీని, క్యారెక్టర్ రోల్స్ లో తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

First Published:  14 Oct 2023 8:33 AM GMT
Next Story