Telugu Global
Cinema & Entertainment

Samantha | సమంత రీఎంట్రీకి రెడీ

Samantha - సమంత ఎట్టకేలకు మళ్లీ తన వృత్తి లోకి వచ్చింది. ప్రైమ్ వీడియో తన కొత్త వెబ్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ"ని ఆవిష్కరించింది.

Samantha | సమంత రీఎంట్రీకి రెడీ
X

సమంత ఎట్టకేలకు మళ్లీ తన వృత్తి లోకి వచ్చింది. ప్రైమ్ వీడియో తన కొత్త వెబ్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ"ని ఆవిష్కరించింది. గూఢచారి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో సమంత హనీ అనే పాత్రను పోషిస్తోంది. సమంత గతంలో రాజ్-డీకే ల సిరీస్ "ఫ్యామిలీ మ్యాన్ 2" లో కనిపించింది. ఇప్పుడు వీళ్లే "సిటాడెల్ హనీ బన్నీ" కూడా తీశారు.

"ఫ్యామిలీ మ్యాన్ 2"లో కనిపించిన తర్వాత ఆమె వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. ఏకంగా తన భాగస్వామి నాగచైతన్య నుంచి విడాకుల తీసుకుంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. దీంతో సినిమాలకు కాస్త దూరమైంది. అలా దూరమైన సమంత, ఇప్పుడు హనీ పాత్రతో మళ్లీ ప్రేక్షకులముందుకు రాబోతోంది.

ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో అతిలోకసుందరిలా కనిపిస్తోంది. త్వరలోనే ఆమె ఈ వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేయబోతోంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే అందుబాటులో వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్‌లో ఆమె యాక్షన్ రోల్ చేసింది.

త్వరలో ఆమె కొన్ని చిత్రాలను కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం వరుసపెట్టి కథలు వింటోంది. వీటిలో ఫిమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ తో పాటు, స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఆమె నటించిన చివరి చిత్రం శాకుంతలం. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా డిజాస్టర్ అయింది.

First Published:  22 March 2024 4:02 PM GMT
Next Story