Telugu Global
Cinema & Entertainment

Salman Khan | టైగర్ 3 ట్రయిలర్ అదిరింది

Salman Khan - టైగర్ 3 తో రెడీ అయ్యాడు సల్మాన్ ఖాన్. దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి ట్రయిలర్ రిలీజ్ చేశారు

Salman Khan | టైగర్ 3 ట్రయిలర్ అదిరింది
X

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ట్రైల‌ర్‌ను చూసేద్దామా అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

టైగర్-3 ట్రయిలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ సెన్సేష‌న్‌ను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ఈ ట్రయిలర్, పాన్ ఇండియా లెవెల్లో అందర్నీ ఆకట్టుకుంది. సల్మాన్ తో పాటు, కత్రినాకైఫ్ ను కూడా యాక్షన్ మోడ్ లో చూపించడం బాగుంది.

సినిమా కథ ఏంటనేది ట్రయిలర్ లో సింపుల్ గా చెప్పేశారు. ఆ మిషన్ ను టైగర్ ఎలా ఛేదించాడనేది స్టోరీ. విలన్ పాత్రధారి ఇమ్రాన్ హస్మిని కూడా చివర్లో చూపించారు. ‘టైగ‌ర్ 3’ చిత్రాన్ని దీపావ‌ళి సంద‌ర్బంగా న‌వంబ‌ర్ 12న ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ట్రయిలర్ చివర్లో ప్రకటించారు.

న‌వంబ‌ర్ 12 ఆదివారం అయితే 13వ తేది అమావాస్య‌, న‌వంబ‌ర్ 14న గోవ‌ర్ధ‌న్ పూజ‌, గుజ‌రాతీల కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు ఉంటాయి. న‌వంబ‌ర్ 15న భాయ్ దూజ్ పండుగ ఉంది. ఇలాంటి హాలీడేస్ సంద‌ర్భంగా విడుద‌లవుతున్న టైగ‌ర్ 3’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్ 3’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో మెప్పించనున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.

First Published:  17 Oct 2023 2:46 AM GMT
Next Story