Telugu Global
Cinema & Entertainment

Tiger 3 | సల్మాన్ సినిమా ట్రయిలర్ రెడీ

Tiger 3 movie - సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా టైగర్-3. ఈ మూవీ ట్రయిలర్ రెడీ అయింది.

Tiger 3 | సల్మాన్ సినిమా ట్రయిలర్ రెడీ
X

స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టిస్తున్న సినిమా టైగ‌ర్‌3. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ని అక్టోబ‌ర్ 16న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు ఆదిత్య చోప్రా. ఈ ఏడాది దీపావళి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు టైగ‌ర్‌3 మూవీని.

య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ నుంచి వ‌స్తున్న స్పై సినిమాలంటే అంద‌రిలోనూ ఓ రకమైన ఆసక్తి. ఇప్పటికే వాళ్లు స్పై యూనివ‌ర్స్ ని క్రియేట్ చేసి పెట్టారు. దాన్ని టైగర్-3తో మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నారు. స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ న‌టిస్తున్న సినిమా ఇది. ఇండియ‌న్ సినిమా మునుపెన్న‌డూ చూడ‌నంత యాక్షన్ ను ఇందులో చూపించబోతున్నారట.

ఏక్‌థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై సినిమాలు సాధించిన స‌క్సెస్ చూసిన త‌ర్వాత ఆదిత్య చోప్రాకి ఈ జోన‌ర్ మీద న‌మ్మ‌కం అమాంతం పెరిగింది. ఆ విశ్వాసం నుంచి పుట్టిన‌వే క‌బీర్ అలియాస్ హృతిక్ రోష‌న్ వార్‌, ప‌ఠాన్ అలియాస్ షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్‌.

ప‌ఠాన్ స‌మ‌యంలోనే స్పై యూనివ‌ర్స్ గురించి ఈ ఫ్రాంఛైజీ లోగో గురించి ప్ర‌క‌టించారు ఆదిత్యా చోప్రా. స్పై యూనివ‌లర్స్ లో క్రాస్ ఓవ‌ర్ క్యార‌క్ట‌ర్ల గురించి కూడా ప‌ఠాన్ స‌మ‌యంలోనే ప్ర‌క‌టించారు. క్రాస్ ఓవ‌ర్ కేర‌క్ట‌ర్ల ప్రాజెక్టుగా ప‌ఠాన్ మెటీరియ‌లైజ్ అయింది. స‌ల్మాన్ ఖాన్‌నీ, షారుఖ్ ఖాన్‌ని, యాక్ష‌న్ సీక్వెన్స్ లో ప‌ఠాన్ స్క్రీన్స్ మీద చూసిన వారికి కిక్ ఇచ్చింది.

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెర‌కెక్కించబోయే నెక్స్ట్ సినిమాల్లోనూ ఈ క్రాస్ ఓవ‌ర్ క్యారెక్ట‌ర్లు సంద‌డి చేయబోతన్నాయి. చూస్తుంటే, టైగర్-3లో కూడా అది ఉండేలా ఉంది. ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకుడు.

First Published:  5 Oct 2023 2:17 AM GMT
Next Story