Telugu Global
Cinema & Entertainment

Devara Movie | దేవర నుంచి సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

Saif Ali khan Devara Movie - దేవర సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చింది. ఈసారి సైఫ్ అలీఖాన్ వంతు.

Devara Movie | దేవర నుంచి సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఆ తర్వాత హీరోయిన్ జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు కీలకమైన మరో ఫస్ట్ లుక్ బయటకొచ్చింది.

ఈరోజు దేవర సినిమా నుంచి సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ పాత్ర పేరు భైర. ఉంగరాల జుట్టుతో, సీరియస్ గా చూస్తున్న పోజును ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఎప్పట్లానే సముద్రాన్ని చూపించారు.

దేవర సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ తో ఓ ద్వీపం చుట్టూ తిరిగే కథతో వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టైటిల్ రోల్ ను ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. అతడ్ని అంతా దేవర అని పిలుస్తుంటారు. అదే దీవిలో ఉండే భైరాతో దేవరకు ఎందుకు శత్రుత్వం వస్తుంది? చివరికి తననే నమ్ముకున్న ద్వీప వాసుల కోసం దేవర ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ.

కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో వస్తోంది ఈ మూవీ. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




First Published:  16 Aug 2023 3:46 PM GMT
Next Story