Telugu Global
Cinema & Entertainment

NagaChaitanya | మరోసారి కలిసిన హిట్ జోడీ

NagaChaitanya - లవ్ స్టోరీ సినిమా తర్వాత మరోసారి సాయిపల్లవితో కలిసి నటించబోతున్నాడు నాగచైతన్య. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

NagaChaitanya | మరోసారి కలిసిన హిట్ జోడీ
X

నాగచైతన్య, సాయిపల్లవి కలిసి గతంలో లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. అది పెద్ద హిట్టయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జంట మళ్లీ కలిసింది. చందు మొండేటి కొత్త సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నారు. అలా హిట్ కాంబినేషన్ రిపీట్ కానుంది.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. ఈ సినిమా కోసం హీరో-దర్శకుడు కలిసి రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మత్స్యకార గ్రామాల్ని కూడా సందర్శించారు. బోటులో సముద్రం మధ్యకు కూడా వెళ్లారు. అలా ప్రీ-ప్రొడక్షన్ తో పాటు, రెక్కీ పూర్తిచేశారు.

ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ముందుగా ఇందులో కీర్తిసురేష్ లేదా అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా అనుకున్నారట. వీళ్లలో కీర్తిసురేష్ ను దాదాపు లాక్ చేశారు. ఎందుకంటే, ఇందులో హీరోయిన్ పాత్ర కాస్త డీ-గ్లామరస్ గా ఉంటుంది. కీర్తిసురేష్ కు ఆల్రెడీ దసరా లాంటి సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి, ఆమెను తీసుకోవాలనుకున్నారు.

అయితే ఆఖరి నిమిషంలో ప్లాన్ మారిపోయింది. కీర్తిసురేష్ స్థానంలో సాయిపల్లవి అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. యాక్టింగ్ పరంగా సాయిపల్లవిని కూడా తక్కువ చేసి మాట్లాడ్డానికి వీల్లేదు. అలా 'లవ్ స్టోరీ' జోడీ మరోసారి కలిసింది.




First Published:  20 Sep 2023 5:22 PM GMT
Next Story