Telugu Global
Cinema & Entertainment

SaiPallavi | తండేల్ సెట్స్ లో సాయిపల్లవి

Sai Pallavi - లిమిటెడ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి, తండేల్ మూవీలో నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను స్టార్ట్ చేసింది సాయిపల్లవి.

SaiPallavi | తండేల్ సెట్స్ లో సాయిపల్లవి
X

నాగ చైతన్య, చందూ మొండేటి, గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా తండేల్. ఇటివలే సెట్స్ పైకి వెళ్ళింది ఈ మూవీ. ఉడిపిలో షూట్ ప్రారంభమైంది. ఇప్పుడు గోకర్ణకు షిఫ్ట్ అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి, తాజాగా టీంలో జాయిన్ అయింది.

ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీని చూడబోతున్నాం. 'తండేల్' వరల్డ్ నుండి హీరోయిన్ స్టిల్ ను విడుదల చేశారు. ఈ ఇమేజ్ లో సాయి పల్లవి బీచ్‌లో నిలబడి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అందమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.

యదార్థ సంఘటనల కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూట్ ప్రారంభించే ముందు టీమ్ ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసింది. నాగ చైతన్య తన పాత్ర కోసం కంప్లీట్ మేక్ఓవర్ అయ్యారు.

కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. షామ్‌దత్ కెమెరా మేన్ గా వ్యవహరిస్తున్నాడు.

First Published:  30 Dec 2023 3:43 PM GMT
Next Story