Telugu Global
Cinema & Entertainment

Ileana | ఇలియానా మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి..?

Ileana - గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. మరి ఆమె సినిమాల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుంది?

Ileana | ఇలియానా మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి..?
X

ఇలియానా ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిగా, కొడుకుతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఓవైపు కొడుకు, భర్తతో ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మరోవైపు అభిమానులతో చాట్ సెషన్లో కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన రీఎంట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది గోవా బ్యూటీ.

ఆమె మరికొన్ని నెలల్లో తిరిగి నటించాలనే ఉద్దేశ్యాన్ని వెల్లడించింది. ఇంకొన్ని రోజులు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసి, ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తానంటూ తన మనసులో మాటను బయటపెట్టింది.

అయినప్పటికీ, ఇలియానా ఇప్పటికే ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలిచ్చాయి. త్వరలోనే ఆమె ఆ స్పెషల్ మూవీలో నటిస్తుందంటూ ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు ఇలియానా పీఆర్ టీమ్ మాత్రం వాటిని కొట్టి పారేస్తోంది. ఆమె బాలీవుడ్ లేదా టాలీవుడ్ లో ఎలాంటి సినిమా కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని స్పష్టం చేస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా ఇలియానా సినిమాలైతే చేస్తోంది కానీ, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ మాత్రం చూడలేదు. అలా సక్సెస్ దక్కలేదు కాబట్టే, ఫ్యామిలీ లైఫ్ లోకి ఆమె ఎంటరైంది. ఆమె చివరిగా రవితేజతో కలిసి 'అమర్ అక్బర్ ఆంథోనీ"లో కనిపించింది. అది కూడా పెద్ద డిజాస్టర్ అయింది. రీఎంట్రీలో ఆమె హీరోయిన్ గానే కొనసాగాలని అనుకుంటోంది. మంచి పాత్రలు దొరికితే ఓటీటీలో కూడా చేస్తుంది. అయితే ఆమె రీఎంట్రీకి ఇంకా టైమ్ ఉంది.

First Published:  1 Dec 2023 4:45 PM GMT
Next Story