Telugu Global
Cinema & Entertainment

Ravanasura - మరో సినిమా పూర్తిచేసిన రవితేజ

Raviteja's Ravanasura Movie - మాస్ రాజా రవితేజ మరో సినిమా పూర్తిచేశాడు. రావణాసుర సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది.

Ravanasura: ఇది పాన్ ఇండియా సినిమా కాదు
X

Ravanasura: ఇది పాన్ ఇండియా సినిమా కాదు

రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. తాజాగా 'రావణాసుర' షూటింగ్ పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో రవితేజ, హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా టోటల్ షూట్ పూర్తయింది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురు వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్, రెండవ సింగిల్‌కి కూడా మంచి స్పందన వచ్చింది.

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. హీరోయిన్లు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించాడు. ఏప్రిల్ 7న రావణాసుర ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఇదే.

First Published:  28 Feb 2023 3:08 AM GMT
Next Story