Telugu Global
Cinema & Entertainment

Raviteja | ల్యాండ్ మార్క్ మూవీని ప్రకటించిన మాస్ రాజా

Raviteja - కెరీర్ లో 75వ చిత్రం మైలురాయికి చేరుకున్నాడు రవితేజ. ఈరోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

Raviteja | ల్యాండ్ మార్క్ మూవీని ప్రకటించిన మాస్ రాజా
X

మాస్ మహారాజా రవితేజ తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో రెండున్నర దశాబ్దాలకు పైగా అలరిస్తున్నాడు. హాస్యాన్ని పండించడంలో రవితేజది విభిన్న శైలి. ఇప్పుడీ స్టయిల్ ను బేస్ చేసుకొని ఓ సినిమా రాబోతోంది. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం ఇది.

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ చిత్రం ప్రకటన వచ్చింది. ఇది రవితేజ శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో కళ్ళద్దాల మీద 'RT 75' అని రాయడం... అలాగే పోస్టర్ మీద "రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి", "హ్యాపీ ఉగాది రా భయ్" అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది.

ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని తెలిపిన మేకర్స్.. సినిమాలో రవితేజ పూర్తిస్థాయిలో కామెడీ పండిస్తాడని చెబుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  9 April 2024 5:09 PM GMT
Next Story