Telugu Global
Cinema & Entertainment

Eagle Movie Trailer | రేపే ఈగల్ ట్రయిలర్

Eagle Movie Trailer | రవితేజ తాజా చిత్రం ఈగల్. ఈ సినిమా ట్రయిలర్ ను రేపు విడుదల చేయబోతున్నారు.

Eagle Movie Trailer | రేపే ఈగల్ ట్రయిలర్
X

Eagle Movie Trailer | రేపే ఈగల్ ట్రయిలర్

Eagle Movie Trailer | మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. టీజర్ విడుదలైన తర్వాత క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఇటివలే విడుదల చేసిన ఈగల్ అంథమ్.. ఆడు మచ్చా పాట కూడా క్లిక్ అయింది.

ఇప్పుడు మేకర్స్ ఈగల్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న ఈగల్ ట్రైలర్ ను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో రవితేజ పెద్ద మిషన్ గన్ తో ఫైర్ చేసున్న టెర్రిఫిక్ లుక్ లో కట్టిపడేశారు.

ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో హీరోయిన్. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.

కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

First Published:  19 Dec 2023 4:46 PM GMT
Next Story