Telugu Global
Cinema & Entertainment

Dhamaka: రవితేజ ధమాకా సినిమా సెన్సార్ టాక్

Raviteja's Dhamaka: ధమాకా సినిమా శరవేగంగా విడుదలకు సిద్ధమౌతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేశారు.

Dhamaka: రవితేజ ధమాకా సినిమా సెన్సార్ టాక్
X

మాస్ రాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మూవీకి U/A రేటింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనిట్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారట.

ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ మెంట్ తో వస్తోంది ధమాకా సినిమా. ఇందులో రవితేజ పోషించిన రెండు పాత్రలూ వినోదాన్ని పంచుతాయంటోంది యూనిట్. చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమాకు మరో వెర్షన్ లా ఈ సినిమా ఉంటుందని, ఆద్యంతం సరదాగా సాగిపోతుందని చెబుతోంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. దాదాపు కీలకమైన సాంగ్స్ అన్నింటినీ విడుదల చేశారు. 15వ తేదీన ట్రయిలర్ ను విడుదల చేస్తారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ధమాకా సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. త్రినాధరావు డైరక్ట్ చేసిన ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ-మాటలు అందించాడు.

First Published:  13 Dec 2022 5:30 AM GMT
Next Story