Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: రవితేజ మాస్ యాక్షన్ ఫస్ట్ లుక్

Waltair Veerayya: వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సారి రవితేజ వంతు.

Waltair Veerayya: రవితేజ మాస్ యాక్షన్ ఫస్ట్ లుక్
X

చిరంజీవి, రవితేజ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ వచ్చేసింది. ఇప్పుడు రవితేజ వంతు.


పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ , టీజర్ ను ఒకేసారి విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. రవితేజ కారులో ఎంట్రీ ఇస్తూ.. చేతిలో మేక పిల్లతో దిగి, విలన్స్ ని ఇరగదీశారు. 'ఏం రా వారీ.. పిస పిస చేస్తుండావ్.. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వనయ్యకీ యిననని'' అని వార్నింగ్ ఇస్తూ రవితేజ చెప్పిన డైలాగ్ కొత్తగా ఉంది.


అంతకుముందు "ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లని ఎత్తుకొన్న పులి వస్తా వున్నది'' అన్న ఇంట్రో డైలాగ్ కూడా అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ టెర్రిఫిక్ గా కొరియోగ్రఫీ చేశారు.


'పవర్' తర్వాత రవితేజ-బాబీ కాంబోలో వస్తున్న సినిమా ఇది. టీజర్ లో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టాకీ పూర్తయింది, చివరి పాటను ప్రస్తుతం యూరప్ లో చిరంజీవి, శృతి హాసన్ పై చిత్రీకరిస్తున్నారు.


'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.





First Published:  12 Dec 2022 1:49 PM GMT
Next Story