Telugu Global
Cinema & Entertainment

రీ-రిలీజ్ లిస్ట్ లోకి రవితేజ కూడా..!

రవితేజ-రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. ఇప్పుడీ సినిమా రీ-రిలీజ్ అవ్వబోతోంది.

రీ-రిలీజ్ లిస్ట్ లోకి రవితేజ కూడా..!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ హంగామా నడుస్తోంది. తమ అభిమాన హీరోలు నటించిన పాత సినిమాలకు, కొత్త టెక్నాలజీ జత చేసి మళ్లీ రిలీజ్ చేయడం అనే సంస్కృతి ఊపందుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మహేష్, పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ నటించిన పాత సినిమాల్ని 4కే రిజల్యూషన్ లోకి మార్చి రీ-రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రభాస్ కు చెందిన 3 పాత సినిమాల్ని, లేటెస్ట్ టెక్నాలజీతో విడుదల చేయబోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరిపోయాడు.

రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా విక్రమార్కుడును మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఈ సినిమాను 4కే రిజల్యూషన్ లోకి మార్చే పనులు మొదలయ్యాయి. జనవరిలో రవితేజ పుట్టినరోజు ఉంది. ఆ బర్త్ డేకి కొన్ని రోజుల ముందు విక్రమార్కుడు మూవీని మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలనేది ఫ్యాన్స్ ఆలోచన.

ఇప్పటివరకు హీరోలకు సంబంధం లేకుండా మాత్రమే రీ-రిలీజులు జరిగాయి. కానీ విక్రమార్కుడు విషయంలో మాత్రం అలా జరగదు. స్వయంగా రవితేజను రంగంలోకి దించి, చిన్నపాటి ప్రచారం చేసి మరీ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అవసరమైతే ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సహాయాన్ని కూడా తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

First Published:  11 Oct 2022 4:24 AM GMT
Next Story