Telugu Global
Cinema & Entertainment

Ravanasura: ఇది పాన్ ఇండియా సినిమా కాదు

Ravi Teja's Ravanasura Movie: రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం లేదు. దీనికి ఓ కారణం ఉంది.

Ravanasura: ఇది పాన్ ఇండియా సినిమా కాదు
X

Ravanasura: ఇది పాన్ ఇండియా సినిమా కాదు

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మోస్తరు సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. అందరూ పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో తమది పాన్ ఇండియా సినిమా కాదంటున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ.

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రావణాసుర. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా రాబోతున్న ఈ సినిమాను కేవలం తెలుగులోనే విడుదల చేస్తున్నారు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.

"ముందు పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నాం. హిందీ , తమిళ్ లో విడుదల ప్లాన్ చేశాం. కానీ వాళ్ళకి 15 రోజుల ముందే కాపీ పంపించాలి. అయితే సినిమాలో మేం ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సెకండ్ వీక్ నుంచి హిందీ ప్లాన్ చేస్తున్నాం."

ఇలా రావణాసుర సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నట్టు స్పష్టం చేశాడు సుధీర్ వర్మ. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా ట్విస్టులున్నాయంట

First Published:  5 April 2023 12:48 PM GMT
Next Story