Telugu Global
Cinema & Entertainment

Animal | రణబీర్ కపూర్ మూవీ టీజర్ అదిరింది

Animal Movie - సందీప్ రెడ్డి వంగ డైరక్ట్ చేసిన సినిమా యానిమల్. ఈ సినిమా టీజర్ రిలీజైంది. అతడి మార్క్ కనిపించింది.

Animal | రణబీర్ కపూర్ మూవీ టీజర్ అదిరింది
X

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ-టీజర్‌తో ఆశ్చర్యపరిచిన మేకర్స్, ఈరోజు రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

2 నిమిషాల 26సెకన్ల యాక్షన్ ప్యాక్డ్ వీడియో ఇంటెన్స్ గా ఉంది. సినిమాలో భారీ ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్‌లు, అద్భుతమైన విజువల్స్, బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వండర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉందనే విషయాన్ని ఈరోజు రిలీజైన టీజర్ తెలియజేస్తోంది.

టీజర్ సినిమా కథ కి ఒక గ్లింప్స్ లా ఉంది. ఇది తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపించిన అనిల్ కపూర్, రణబీర్ కపూర్ ల కథ. వారిమధ్య చాలా సంక్లిష్టమైన సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. తండ్రి తనపై చేయి చేసుకున్నప్పటికీ హీరో తన తండ్రిని "ప్రపంచంలోని ఉత్తమ తండ్రి" అని నమ్ముతాడు.

హీరో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి అత్యంత హింసాత్మకంగా మారతాడు. బాబీ డియోల్ క్లిప్ చివరిలో విలన్ గా పరిచయమైంది.

పిల్లల గురించి రణబీర్,రష్మిక మందన్నల మధ్య చర్చతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆమె అతనిని ఏదైనా అడగవచ్చు, అతను నిజాయితీగా ఉంటాడు, కానీ తన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడొద్దని చెప్తాడు. వీరి సంభాషణ జరుగుతున్నపుడు చూపించిన రక్తపాతం, కారు ఛేజింగ్‌లు, ఇంటెన్స్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

First Published:  28 Sep 2023 5:13 PM GMT
Next Story